
సాధారణంగా సింహం వేటాడుతున్న సమయంలో ఆ వీడియోలు చూస్తేనే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అదే ఒక మనిషి మీద సింహం దాడి చేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ఇటీవల కాలంలో చిరుతపులులు ఎలుగు బంట్లు లాంటి క్రూర మృగాలు జనావాసాల్లోకి వచ్చి దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే సింహాలు పులులు లాంటివి మాత్రం జనావాసాల్లోకి రావడం లాంటి ఘటనలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటాయి.. ఇక్కడ సింహం జనావాసాల్లోకి రావడమే కాదు ఒక యువకుడిపై దాడి కూడా పాల్పడింది.
విద్యుత్ వెలుగు లలో జరుగుతున్న పార్టీ లోకి చొరబడింది సింహం.. ఈ క్రమం లోనే ఒక యువకుడు సింహం నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఎక్కడికక్కడ పారి పోయారు. అయితే చెట్టు ఎక్కిన వ్యక్తిని టార్గెట్ గా చేసుకుని సింహం కొబ్బరి చెట్టును అలవోకగా ఎక్కేసింది. అతని పై దాడి చేయడానికి ప్రయత్నించింది. చెట్టు చివరన ఉన్న వ్యక్తి కాళ్లతో సింహాన్ని తన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.