కొన్ని కొన్ని సార్లు కాళ్లు చేతులు కూడా పొరపాటున తాకుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఇవన్నీ కామన్ అని వదిలేయకుండా కొంతమంది ఏకంగా గొడవకు దారి తీస్తూ ఉంటారు. మరికొంతమంది టికెట్ ధర విషయంలో లేదా కండక్టర్ దగ్గర చిల్లర విషయంలో కూడా గొడవలు పడటం లాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మాత్రం ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్సిసి క్యాడెట్ బస్సు ఎక్కాడు. అయితే టికెట్ తీసుకోవడానికి కండక్టర్ వచ్చాడు.
ఈ క్రమంలోనే అతడికి 15 రూపాయల టికెట్ ఇచ్చాడు కండక్టర్. తాను దిగే బస్ స్టాప్ వరకు కేవలం పది రూపాయలు మాత్రమేనని 15 రూపాయలు ఎలా తీసుకుంటావంటూ ఎన్సిసి క్యాడెట్ పట్టుపట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు చేసుకునేంత వరకు వెళ్ళింది. అయితే కండక్టర్ పై ఎన్సిసి క్యాడెట్ పిడుదులు కురిపించాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత బస్సు స్లో కావడంతో ఇక దిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ స్థానికులు కొందరు అతని పట్టుకొని చివరికి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.