కొన్నిసార్లు ఊహించని నష్టాల కారణంగా ప్రియమైన వారిని కోల్పోయే దుస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక వలసదారుల కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయి అన్నదానికి కళ్ళకు కట్టేలా చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అనే చెప్పాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది అని చెప్పాలి. సాధారణంగా రక్తం పంచుకుని పుట్టిన కొడుకు మరణిస్తే ఆ తండ్రికి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.
కన్న కొడుకు చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తప్పని పరిస్థితుల్లో ఒక అనాథ శవంలా సముద్రములో పడేయాల్సి వస్తే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. సిరియా దేశానికి చెందిన కొంతమంది వ్యక్తులు వాళ్లతో కలిసి అక్రమ మార్గంలో యూరప్ కు వెళుతున్నారు. మార్గమధ్యంలో చిన్నారికి దాహం వేసింది. నీళ్ళు కావాలని అడిగాడు. కానీ అతని దాహం తీర్చేందుకు వారి వద్ద నీరు లేదు. బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తూ చివరికి ప్రాణాలు కోల్పోయాడు. కళ్ళ ముందు కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తండ్రి గుండె ఆగినంత పని అయింది. గుండె రాయి చేసుకుని కొడుకు మృతదేహాన్ని గుడ్డలో కట్టి సముద్రంలో పడేసాడు తండ్రి.