సాధారణంగా నేటి రోజుల్లో ప్రతి మనిషి కూడా అత్యాశ పరుడు గా మారిపోయాడు . ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా లేనిదాని కోసం పాకులాడుతుంటాడు. ఈ క్రమంలోనే ఎంత ఆస్తి ఉన్నా కూడా లేని దాని కోసం ఆశ పడుతున్న నేపథ్యంలో ఎవరికి కూడా కాస్త అయినా మనశ్శాంతి లేకుండా పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మన పురాణాలలో కూడా.. ఉన్నది మాత్రమే నీది.. లేనిది నీది కాదు అని ఎన్నో గొప్ప అర్థాలను ఇచ్చే శ్లోకాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ మనిషి ఎక్కడ పట్టించుకోవడం లేదు. అది సరేగాని ఇక ఇప్పుడు ఇలాంటి జీవిత సత్యాలు గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్..


 ఇక్కడ ఒక వృద్ధుడు కి సంబంధించిన మీడియా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. వైరల్ గా మారిపోయిన ఈ వీడియోలో చూసుకుంటే ఉన్నదాంతో సరిపెట్టుకుని సంతోషంగా జీవించవచ్చు అని ఈ వృద్ధుడిని చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన ఈ వీడియో ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ వృద్ధుడికి రోజు వారి సంపాదన వచ్చేది చాలా తక్కువే. కానీ అయ్యో దేవుడా ఇంత తక్కువ సంపాదన ఎందుకు.. ఇంకా కాస్త ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది అని లేనిదాని కోసం ఆ వృద్ధుడు ఆలోచించలేదు.



 ఎందుకంటే ఆ వృద్ధుడు తన రోజు వారి సంపాదన తక్కువ అయినప్పటికీ ఎంతో ఆనందంగా ఆ డబ్బు మొత్తాన్ని లెక్కబెడుతూ ఉన్నాడు. వైరల్ అవుతున్న వీడియో  జిందగీ గుల్జార్ అనే పేజీ ట్విట్టర్ లో షేర్ చేయగా.. వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆనందం ఎక్కడో లేదు మనకున్న దాంట్లో సర్దుకుపోయి జీవించడం లోనే ఉంది అని కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఈ వృద్ధుడు 80 ఏళ్ల వయసులో కూడా ఎంతగానో కష్టపడుతూ సంతోషంగా జీవిస్తూ అందరికీ ఒక జీవిత సత్యాన్ని బోధించాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: