కొంతమంది ఉపవాసాలు ఉండి కూడా ఎంతో నిష్టగా పూజలు చేయడం చూస్తూ ఉంటాం. అయితే నాగు పాము లేదా తాచుపాము శివుడికి ముఖ్య అనుచరులుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయ్. శివుడి గుడి ఎక్కడైనా ఉంది అంటే చాలు అక్కడ చుట్టుపక్కల్లో తప్పకుండా ఒక నాగుపాము ఉంటుందని అంటూ ఉంటారు అందరూ. అంతేకాదు శివలింగానికి లేదా నాగమణికి నాగుపాము కాపలాగా ఉంటుందని కూడా చెబుతూ ఉంటారు పెద్దలు. కానీ నేటి రోజుల్లో జనాలు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తూ ఉంటారు అని చెప్పాలి.
కానీ ఇప్పటివరకు ఇదే విషయాన్ని ఎన్నో సీరియల్స్ లో సినిమాల్లో కూడా చూపిస్తే జనాలు ఇలాంటి సన్నివేశాలను చూసి చప్పట్లు కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు తెరపై నాగుపాము నాగమణికి కాపలా కాయడం మాత్రమే చూసాము. కానీ రియల్ గా ఇక్కడ నాగమణికి ఒక నాగుపాము కాపలాగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నల్లత్రాచు పాము ఒకటి నాగమణికి కాపలాగా ఉంది. రాత్రి సమయంలో కూడా కాపలా కాస్తూ ఉండడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇది కేవలం గ్రాఫిక్స్ మాత్రమేనా నిజంగా ఇది జరిగిందా అన్నది మాత్రం ఎన్నిసార్లు చూసిన నెటిజన్లు అర్థం చేసుకోలేకపోతున్నారు.