ఇక తల్లిదండ్రులు ఏమో మా పిల్లాడు రోజు స్కూలుకు వెళ్తున్నాడు. బాగా చదువుకుంటున్నాడు. ప్రయోజకుడు అవుతాడు అని నమ్మకం పెట్టుకుంటే.. పిల్లలు మాత్రం చేస్తుంది మరొకటి. ముఖ్యం గా స్కూల్ పిల్లలు నేటి రోజుల్లో ఎంత దారుణం గా మారిపోయారు అన్నదానికి సంబంధించిన వీడియోలు ఇటీవల వైరల్ గా మారిపోతున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్ ఏజ్ లో అమ్మాయిలకు ఆకర్షితులు అయ్యారు ఇద్దరు విద్యార్థులు. పోయి పోయి ఇద్దరూ ఒకే అమ్మాయిని లవ్ చేశారు.
ఇలా ఒక అమ్మాయిని లవ్ చేస్తే సినిమాల్లో హీరో విలన్ ఇద్దరు కొట్టుకుంటారు. ఇక్కడ విద్యార్థులు కూడా రౌడీల్లా మారిపోయి ఇలాగే ప్రవర్తించారు. ఆ అమ్మాయి నాది అంటే నాది అంటూ ఏకంగా అందరి ముందే కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడుగులు కురిపించుకున్నారు. అయితే అక్కడ ఉన్న మిగతా విద్యార్థులు ఆపడం మానేసి అక్కడ ఏదో వేడుక జరుగుతుంది అన్నట్లుగా కళ్ళు పెద్దవి చేసి మరి చూశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్లో తెగ చెక్కలు కొడుతుంది. ఈ ఘటన కోల్కతాలో చోటు చేసుకుంది అన్నది తెలుస్తుంది. ఇక విద్యార్థులు చేసిన పనికి నెటిజెన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.