అయితే ఇటీవలే ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వే ప్లాట్ఫామ్ పై ఆగిన రైలు మెల్లగా కదలడం మొదలుపెట్టింది. ఇలాంటి సమయంలోనే ఒక వ్యక్తి కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. కాని చివరికి ప్రమాదవశాత్తు కాలుజారి రైల్వే ప్లాట్ఫారం.. కదులుతున్న రైలు మధ్య చిక్కుకుపోయాడు. దీంతో అక్కడే ఉన్న ఆర్పిఎఫ్ సిబ్బంది క్షణాల వ్యవధిలో అప్రమత్తమై చాకచక్యంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
తమిళనాడులోని కోయంబత్తూరు లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించిన క్లిప్ ను ఆన్లైన్లో ఆర్పిఎఫ్ ఇండియా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చూసుకుంటే రైలు కదులుతున్న సమయంలో ఒక వ్యక్తి రైలు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కాలుజారి రైలుకి ప్లాట్ఫామ్ కి మధ్య ఉన్న గ్యాప్ లో ఇరుక్కుపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రాణాలు పోయేవి కానీ అక్కడే ఉన్న ఆర్పిఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ లేడీ హెడ్ కానిస్టేబుల్ పీపీ మినీ కాపాడి ప్లాట్ఫామ్ పైకి అతని లాగారు. ఇక ఎందుకోసం ఎంతగానో కష్టపడ్డారు అని చెప్పాలి. ఇక సమయస్ఫూర్తిని ప్రదర్శించి ప్రాణాలు కాపాడిన ఆర్పిఎఫ్ సిబ్బందిపై నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం.