
ఇలాగే పులి ఎంత క్రూరమైన జంతువు అయినాప్పటికీ.. ఎంతో వేగంగా వేటాడే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ.. కొన్ని జంతువులు మాత్రం తమను వేటాడటానికి వచ్చిన పులిని ముప్పు తిప్పులు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇలా పులితోనే ఆటలు ఆడే జంతువులలో కోతులు కూడా ఉంటాయి అని చెప్పాలి. సాధారణంగా కోతులు చెట్ల కొమ్మలపై ఎంతో వేగంగా కదులుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి టాలెంట్ క్రూర మృగాల నుంచి కోతులను కాపాడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలో కూడా ఇది గమనించవచ్చు.
నువ్వు పులి అయితే నాకేంటి ఇది నా అడ్డ అన్న విధంగానే ఇక్కడ ఒక కోతి పులితో వ్యవహరించింది అని చెప్పాలి. తన కోతి చేష్టలతో పులితోనే ఒక ఆట ఆడుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వైరల్ గా మారిపోయిన వీడియోలో.. చెట్టుపై ఉన్న కోతిని వేటాడేందుకు పులి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఎంతో కష్టపడి చెట్టు ఎక్కుతుంది. ఇక బ్యాలెన్స్ చేసుకుంటూ ఎట్టకేలకు కోతి దగ్గరికి చేరుతుంది. ఇంత జరిగిన తర్వాత ఆ కోతి అక్కడే ఉంటుందా.. చిటారి కొమ్మకు వెళ్లి పులితో దాగుడుమూతలు ఆడుతూ ఉంటుంది. చివరికి పులి దాడి చేయడానికి వచ్చిన సమయంలో మరో కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. తద్వారా ఇక కోతి పై దాడి చేయడానికి వచ్చిన పులి చివరికి చెట్టు మీద నుంచి కిందికి పడి తోక ముడుచుకుంటుంది.