మన దేశం ఎన్నో సాంప్రదాయాలకు నిలయం..అలాగే భక్తి ఎక్కువగా కలిగిన దేశం.. ఎన్నో ప్రముఖ ఆలయాలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉండే దేవాలయాల లో కొన్ని నమ్మలేని విషయాల ను కూడా మనం చూసే ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. తూర్పు గోదావరి జిల్లా ఆలయాలకు కేరాఫ్ గా నిలుస్తోంది.. ఆ జిల్లాల్లో ఎన్నో దేవలయాలు ఉండగా.. పిఠాపురం పుణ్య క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వయంగా శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానంగా దీనికి పేరుంది.


మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిస్సా, కర్ణాటకకు చెందిన భక్తులు ఇక్కడకు నిత్యం వందలాదిగా వస్తుంటారు. ఇక్కడున్న శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రంలో గడిపి అనుభూతి పొందుతారు. మరీ అలాంటి క్షేత్రంలో ఓ వింతైన సాంప్రదాయం కూడా ఉంది.. కొబ్బరి చెట్టు నుండి వచ్చే కొబ్బరి కాయలు తీసుకుని దేవుళ్లకు కొడుతుంటారు. కొంత మంది మొక్కు తీర్చుకున్నాక కొబ్బరికాయుల కొడితే, కొంత మంది మొక్కుకునే సమయంలో కొబ్బరికాయలు కొడతారు. అయితే శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం లో కొబ్బరి కాయలు కొట్టరు. ఇక్కడ ఓ చెట్టుకి కడతారు. అదేం చెట్టు అనుకోవద్దు. ఎంతో ప్రసిద్ధి గాంచిన ఔదంబరవృక్షం.


చెట్టుకి కొబ్బరికాయలు కట్టి ప్రదిక్షణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఒక బలమైన సంకల్పం తో కొబ్బరికాయ కడితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. ఎక్కడెక్కడి నుండో దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పారాయణం చేసి మరీ కొబ్బరి కాయలు చెబ్టుకి కడతారు..అక్కడ తెలుగు రాష్ట్రాల తో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. ప్రస్తుతం దేవాధాయ శాఖలో ఉన్న ఈ ఆలయానికి ఆస్తులు కూడా ఎక్కువగా ఉండటంతోపాటు, విరాళాలు సేకరణ బాగుంటుంది. ఇక్కడ రూమ్స్ ఉచితంగా ఇస్తారు. అయితే ముందుగా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవాలి. అలాగే వచ్చిన భక్తులకు రెండు పూట్ల భోజన సౌకర్యం కల్పిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: