
ఇక ఇలాంటి తరహా వీడియోలు ఇటీవల కాలంలో తరచూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. సాధారణంగా ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు అందరూ తమదైన శైలిలో డాన్స్ చేసి ఆ ఫంక్షన్ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం చిత్ర విచిత్రమైన డాన్స్ తో అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటారూ అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక విచిత్రమైన డాన్స్ కు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఇక్కడ ఒక యువకుడు చేసిన డాన్స్ మాత్రం నెటిజన్లు అందరినీ కూడా షాక్ కి గురిచేస్తుంది అని చెప్పాలి.
ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో ఆ యువకుడు డాన్స్ చూస్తే అతనికి పూనకం వచ్చిందా లేకపోతే అలాంటి డాన్స్ ఒకటి ఉంది అన్న విషయం మాకు తెలియదా అన్న అనుమానం మీకు కలుగుతుంది. ఒక పెళ్లి వేడుక జరుగుతుంది. ఇక అక్కడ డీజే పెట్టగా అందరూ కలిసి స్టెప్పులు వేస్తున్నారు. ఇంతలో కుర్చీ మీద కూర్చున్న ఒక అబ్బాయి పూనకం వచ్చినట్లుగానే చేశాడు. ఈ క్రమంలోనే పాట మొదలైన కొన్ని సెకండ్ల తర్వాత కుర్చీ నుంచి లేచి విచిత్రమైన రీతిలో డాన్స్ చేశాడు. కిందపడిన కూడా అతను డాన్స్ ఆపలేదు అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ డాన్స్ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.