
ఏకంగా ముంబైలోని ఫిలిం సిటీ లో నాలుగు వారాల వయసున్న చిరుత పులి పిల్ల కనిపించడంతో స్థానికులు అందరూ కూడా షాక్ అయ్యారు. ఫిలిం సిటీలోకి చిన్నారి చిరుతపులి ఎక్కడ నుంచి వచ్చిందా అని అందరూ ఆలోచనలో పడిపోయారు. అయితే అంతలోనే ఈ చిరుత పులి పిల్లను గమనించిన కుక్కలు ఇక దానిని తరమటం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు పెట్టిన చిరుత పులిని గమనించిన సెక్యూరిటీ గార్డులు స్థానికులు కుక్కలను అక్కడ నుంచి వెళ్లగొట్టి చిరుత పులి పిల్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తద్వారా కుక్కల బారి నుంచి ఆ చిన్నారి చిరుత పులి ప్రాణాలను కాపాడారు.
ఇక ఇందుకు సంబంధించి వెంటనే అటు అధికారులకు సమాచారం అందించారు అని చెప్పాలి. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల వద్ద నుంచి చిరుతపులిని తీసుకున్నారు. ఇక చిరుత పులి పిల్ల ను తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత త్వరలోనే తల్లి దగ్గరికి చేరుస్తామని అధికారులు చెప్పారు. చిన్నారి చిరుత పులి ప్రాణాలను కాపాడిన స్థానికులపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.