అగ్గిపుల్ల.. సబ్బు బిల్లా.. కాకి పిల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. ఇక శ్రీశ్రీ చెప్పిన మాటలను ఇటీవల కాలంలో ఎంతోమంది తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. క్రియేటివిటీకి కాదేది అనర్హం అన్న విధంగానే సరికొత్త ఆలోచనలతో ఎప్పుడూ అందరినీ అవ్వక్కయ్యేల చేస్తున్నారు. తమలో దాగి ఉన్న సృజనాత్మకతను సరికొత్తగా చూపిస్తూ.. అటు తమ ఐడియాలతో సోషల్ మీడియాలో ఫేమస్ అవుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో వినూత్నమైన వీడియోలకు సోషల్ మీడియాలో కొదవ లేకుండా పోయింది అని చెప్పాలి.


 నెటిజెన్ల దృష్టిని ఆకర్షించే వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో ప్రతిరోజు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక ఇలాంటి వీడియోలలో కొంతమంది వ్యక్తులు చూపించిన క్రియేటివిటీ చూసి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బాసు అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి కోవకు చెందిన ఒక వీడియో వైరల్ గా మారిపోయింది.. ఇక్కడ ఒక బస్సు డ్రైవర్ చూపించిన క్రియేటివిటీ కి నెటిజెన్లు అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సుకూ సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.


 ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన బస్సు నడపడం కోసం ఉన్న సమస్యను ఎలా అధిగమించాడో ఇక ఈ వీడియోలో తెలుస్తుంది అని చెప్పాలి. విపిన్ రాథోడ్ అనే ఒక బస్సు డ్రైవర్ పనిచేస్తున్నాడు. సాధారణంగా వర్షం పడినప్పుడు లేదా ఏదైనా దుమ్ము ధూళి అద్దం మీద పేరుకుపోయినప్పుడు దానిని శుభ్రం చేసేందుకు బస్సు కార్లకి వైపర్లు ఉంటాయి అన్న విషయం  తెలిసింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సుకు ఉన్న వైపర్ కారణంగా అతనికి ఇబ్బందులు ఎదురవుతూ వినూత్నంగా ఆలోచించి ఒక వాటర్ బాటిల్ సాయంతో కొత్త వైఫర్ తయారు చేశాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: