
అంతే కాదు కొన్ని కొన్ని సార్లు వీధులలో తిరిగే ఆవు గేటు ముందు ఆగినా కూడా ఇక ఏదో ఒక ఆహారం పెట్టి ఆవును పంపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఆవు అనేది సాధు జంతువు.. ప్రశాంతతకు మారుపేరు దాన్ని ఎవరు ఏమన్నా కూడా సైలెంట్ గానే ఉండిపోతూ ఉంటుంది. కానీ ఎవరైనా అతి చేస్తే మాత్రం ఆవుకు కోపం వస్తుంది అన్నది ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతూ ఉంది అని చెప్పాలి. తనను కాళ్లతో తన్నుతూ దారుణంగా హింసించిన ఒక యువకుడిపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆవు దారుణంగా దాడి చేసింది.
ట్విటర్లో ఈ వీడియో చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక వ్యక్తి తాడుతో కట్టేసి ఆవును ముందుకు లాగుతూ ఉంటాడు. ఆవు మాత్రం ఎందుకో ముందుకు వెళ్లేందుకు ఇష్టపడదు.. ఇలాంటి సమయంలోనే ఆవును గట్టిగా తన్నిన తర్వాత ఇక ఆ వ్యక్తి తన చేతిలో ఆవుతోకను తీసుకొని బలంగా తిప్పుతూ దానికి నొప్పి అయ్యేలా చేస్తూ ఉంటాడు. దీంతో కోపంతో రగిలిపోయిన ఆవు వెనకాలకు తిరిగి వ్యక్తిపై దాడి చేస్తుంది. కిందపడిన వదలకుండా కొమ్ములతో కుమ్మేస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత సాధు జంతువైన ఆవకు కూడా ఇంత కోపం ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.