ఏది ఏమైనా పాములకు సంబంధించిన వీడియోలు మాత్రం నేటి రోజుల్లో తెగ వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే సాధారణంగా భారత్ లో కింగ్ కోబ్రాలు ఉండడం చాలా తక్కువ. కేవలం నాగుపాములు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో భారత్లో ఎక్కడికి అక్కడ కింగ్ కోబ్రాలు ప్రత్యక్షమవుతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి చేస్తుంది. ఇక్కడ కింగ్ కోబ్రా కి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. ఇటీవల ఒక గడ్డివాములో కింగ్ కోబ్రా దూరింది. గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు
కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు వచ్చిన స్నేక్ క్యాచ్యల్ కు ఆ పాము చుక్కలు చూపించింది అని చెప్పాలి. అయినప్పటికీ ఎంతో చాకచక్యంగా భయపడకుండా ఆ పామును కంట్రోల్ చేసి పట్టుకున్నాడు సదురు స్నేక్ క్యాచర్. మురళి వాలే హౌస్ల అనే వ్యక్తి యూపీలో డేరింగ్ స్నేక్ క్యాచర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం ఒక స్టిక్ సహాయంతో చేతుల్లోనే ప్రమాదకరమైన పాములను పట్టుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల యూపీలోని ఒక గ్రామంలో రెండు కింగ్ కోబ్రాలు చక్కర్లు కొడుతుండడంతో ఇంట్లోని వారు భయపడి వెంటనే అతనికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సదరు వ్యక్తి రెండు కింగ్ కోబ్రాలను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. .