మనం సాధారణంగా పాఠశాలకు వెళ్లో, కళాశాలలోనో విద్యనభ్యసించడం ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటాం. కొన్ని విషయాలు తల్లిదండ్రులో, నిపుణులో చెబితే వాటి గురించి తెలుసుకుంటాం.మరి వన్య మృగాలకు జీవిత పాఠాలను ఎవరు నేర్పిస్తారు. అంటే ప్రకృతే వాటికి పాఠశాల అని చెప్పాలి. అవి ప్రకృతిలో నిరంతరం జరిగే ప్రక్రియను గమనిస్తూ అనేక పాఠాలు నేర్చుకుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియో ఒక ధ్రువపు ఎలుగుబంటికి సంబంధించినది. ఇవి సాధారణంగా మంచుప్రాంతాల్లో కనిపిస్తాయి. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ తెల్లని ధ్రువపు ఎలుగుబంటి మంచుతో గడ్డకట్టిన ఒక చిన్న నీటి ప్రవాహాన్ని దాటడానికి ఎంతో తెలివిగా వ్యవహరించింది. అది నేరుగా గడ్డకట్టిన నీటిపై నడిస్తే పగిలిపోయి అందులో పడిపోయే ప్రమాదముందని, తెలివిగా దానిపైన పడుకొని జారుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియోని ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.


 ధ్రువపు ఎలుగుబంటి నేర్పుతున్న జీవితపాఠం అంటూ ఆమె దీనికి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఈ ఎలుగు తెలివితేటలకు ముచ్చటపడిపోతుంటే.. మరికొందరు ఇదేదో సైంటిస్ట్ ఎలుగుబంటిలా ఉందంటూ జోకులు వేస్తున్నారు.సాధారణంగా పల్చటి మంచు పొరపై నిలబడితే ఒత్తిడి ఎక్కువై అది పగిలిపోతుంది. ఫలితంగా నీటిలో మునిగిపోవాల్సి వస్తుంది. పైగా ఈ నీళ్లు అత్యంత చల్లగా ఉంటాయి. అందుకే దానిపై పడుకోవాలని సైన్స్ చెబుతుంది. అలా చేస్తే మన శరీరం బరువు ఒకే ప్రాంతంపై పడకుండా.. మంచు పొరపై సమంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తద్వారా మంచుపై తీవ్రత తగ్గి అది పగలదు. మంచుపర్వత ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకు ఈ విషయంపై బాగా అవగాహన ఉంటుంది. మరి ఈ ఎలుగుబంటికి ఎవరు ఇది నేర్పించారంటూ తెగ మెచ్చుకుంటున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈ ఎలుగుబంటికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: