మనం హోటల్ కు లేదా ఏదైనా రెస్టారెంట్ కు వెళితే గంటల తరబడి వెయిట్ చేయాల్సిందే..ఎంత ఆకలితో వెలతామో..అంతకు మించి వాళ్ళు వెయిట్ చెయిస్తారన్న విషయం అందరికి తెలిసిందే.. కొంత మందికి ఇష్టమైన ఫుడ్ తినాలని వుంటే చచ్చినట్లు వెయిట్ చెయ్యాల్సిందే..కానీ కొంతమంది మాత్రం కోపంతో రగిలి పోతారు. దాంతో ఎదో నాలుగు మాటలు హోటల్ సిబ్బందిని అనేసి వెళ్ళి పోతారు..ఇంకా కోపం ఉన్న వాళ్ళు ఏదొక పని చేసి మరీ వెలతారు.అలాంటి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. విషయానికొస్తే..


రెస్టారెంట్ అన్నాక ఒక్కసారిగా ఫుడ్ ఆర్డర్స్ వచ్చిపడటం సర్వసాధారణం. వాటి ల్లో కొన్ని సమయానికి అందించవచ్చు. మరికొన్ని లేట్ కావచ్చు. ఈ తరుణం లోనే చాలామంది కస్టమర్లు తమ ఆర్డర్ లేటు అవుతోందని..కోపద్రుక్తులవుతుంటారు. సరిగ్గా ఈ కోవలోనే తాజాగా ఓ ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది.. అతను ఎంత ఆకలితో ఉన్నాడో ఏం పాపం చివరకు అందరికి షాక్ ఇచ్చి వెళ్ళాడు.. అతను ఏం చేశాడో ఇప్పుడు ఒక సారి చుద్దాము..


న్యూయార్క్‌లోని బంగ్లాదేషి రెస్టారెంట్‌ కు 49 ఏళ్ల చోఫెల్ నోర్బు అనే వ్యక్తి వచ్చాడు. బాగా ఆకలి మీదున్న అతడు చికెన్ బిర్యానీని ఆర్డర్ పెట్టాడు. అయితే ఏదో సాంకేతిక సమస్య కారణంగా ఆ ఆర్డర్ కాస్తా లేట్ వచ్చింది. అంతే.. మనోడి కి కోపం కట్టెలు తెంచుకుంది. ఓ విధమైన మండే ద్రవం తో ఏకంగా రెస్టారెంట్‌కే నిప్పంటించాడు. ఈ క్రమంలోనే అతడిపై కి కూడా నిప్పులు ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్‌ లో రికార్డు కాగా.. పోలీసులు సదరు నిందితుడ్ని అదుపులో కి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ వీడియో ను న్యూయార్క్ అగ్నిమాపక సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: