నేటి రోజుల్లో విద్యార్థులందరూ కూడా స్టైల్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ట్రెండ్ కూ తగ్గట్లుగా దుస్తులు ధరిస్తూ ఆభరణాలు కూడా ధరిస్తూ ఉంటే ఇక్కడ ఒక విద్యార్థి మాత్రం అందరికీ భిన్నంగా ఊహించని రీతిలో బట్టలు ధరిస్తూ ఉండడం గమనార్హం. సాధారణంగా టవలు ఎప్పుడు కట్టుకుంటారు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు లేదా బాత్రూం కి వెళ్ళినప్పుడు మాత్రమే టవల్ కట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విద్యార్థి మాత్రం చదువుకోడానికి వెళ్లడానికి కూడా టవల్ కట్టుకొని వెళ్తున్నాడు. మధ్యప్రదేశ్లోని బర్డ్ వానికి చెందిన కన్నయ్య అనే కుర్రాడికి బట్టలు అంటే మహా చిరాకట.
ఎవరైనా అతన్ని చొక్కా ప్యాంటు వేసుకోమని చెబితే వారితో మాట్లాడటం కూడా మానేస్తాడట. ఇక చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు బట్టలు వేసుకోవాలని ఎంత నచ్చ చెప్పిన అతను చెవిన పెట్టుకోలేదు. ఈ క్రమంలోనే ఒక టవల్ కప్పుకుని బడికి వెళ్తూ ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అతను చేర్పించేందుకు వెళ్తే అక్కడ యాజమాన్యం ప్రవేశం కల్పించలేదు. చివరికి కలెక్టర్ అనుమతి తీసుకున్న తర్వాత అతనికి ప్రవేశం లభించింది. ఇక కాలేజీకి వెళ్తే బట్టలు వేసుకోవాల్సి వస్తుందేమో అని భయపడి పదవ తరగతితో చదువు ఆపేస్తానని చెబుతున్నాడు.