
ఇక ఇలా దొంగతనాలు చేసిన తర్వాత వచ్చిన డబ్బుతో ఏకంగా కారు, బంగ్లాలు కొనుక్కుని దర్జాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక దొంగ మాత్రం కాస్త డిఫరెంట్.. ఇప్పటివరకు దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో కారు కొనడం చూసాం.. కానీ ఇక్కడ ఒక దొంగ మాత్రం కారు కొన్న తర్వాత దర్జాగా గుడికి వచ్చి దొంగతనం చేశాడు. ఈ ఘటన కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా దేవుని ప్రార్థించడానికి వచ్చినట్లుగా కారులో దర్జాగా వచ్చిన దొంగ ఆ తర్వాత హుండీని దొంగలించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్ లో వెలుగు చూస్తుంది.
ఒకవైపు జనమంతా దీపావళి సందడిలో ఉండగా దొంగ మాత్రం తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గౌర్ చోకి లోని హనుమాన్ దేవాలయానికి కారులో వెళ్ళాడు దొంగ. గుడి బయట చెప్పులు వదిలిపెట్టి లోనికి వెళ్ళాడు. ఏకంగా దేవుడికి దండం పెట్టి ప్రార్థన కూడా చేశాడు. అనంతరం గుడిలో నుంచి హుండీని చోరీ చేశాడు. ఇదంతా సీసీటీవీలో రికార్డు అయింది. దీంతో హుండీ చోరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగ ఎవరు అనే విషయం కనిపెట్టే పనిలో పడ్డారు పోలీసులు. గతంలో కూడా ఇలాంటి తరహా చోరీ జరిగినట్లు గుర్తించారు.