విషపూరితమైన కోబ్రా స్నేక్స్.. ఏకంగా భారీ జంతువులను సైతం ఆహారంగా మార్చుకునే అనకొండలు కొండచిలువలు లాంటి పాములకు సంబంధించిన వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వీడియోలలో కొన్ని అయితే ఏకంగా వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ను షేక్ చేస్తూ తెగ వైరల్ గా మారిపోయింది. సాధారణంగానే ఒక వీడియోలో భారీ కొండ చిలువను చూస్తే భయం పుడుతూ ఉంటుంది.
అలాంటిది ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలో మాత్రం భారీ కొండచిలువ మాత్రమే కాదు ఇక పక్కనే ఒక పెద్ద అనుకొండ కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ రెండు భారీ పాములు కూడా ఒక జూలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీటిని చుట్టూ తీగలతో వలలా ఉన్నా ఒక స్థలంలో ఉంచారు. ఇక రెండు పాముల కోసం టబ్ లో నీటిని కూడా ఉంచారు. అయితే టబ్ పై చనిపోయిన ఉడతని ఉంచారు. అనకొండ కొండచిలువ కూడా దానిని తినేందుకు దూసుకు వచ్చాయి. ఇక ముందుగా కొండచిలువ ఉడతను తినాలని ప్రయత్నించినప్పటికీ అనకొండ తో పోటీ పడలేక వెనక్కి తగ్గుతుంది.. ఇక ఆ తర్వాత అనకొండ ఉడతను అమాంతం మింగేస్తుంది.