మొసళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఒక పెద్దాయన సరదాగా విహారయాత్రకు వెళ్ళాడు.. ఈ క్రమంలోనే అక్కడే ఏదో తినడానికి వండుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో అక్కడికి ఒక మొసలి ఎంట్ర ఇచ్చింది.. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన ఆ పెద్దాయన ఏకంగా తన చేతిలో పెనంతో ఒక్కసారిగా మొసలి పై దాడి చేయడంతో అది అక్కడి నుంచి పారారయింది. ఈ వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ముఖ్యంగా పబ్జి ప్రియులకు ఎక్కువగా నచ్చేస్తుంది అని చెప్పాలి.
ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మొసళ్ళు ఎక్కువగా ఉండే ఓ లేక్ ప్రాంతంలో ఈ పెద్దాయన విహారయాత్రకు వెళ్ళాడు అన్నది తెలుస్తుంది. ఇలా తనపై దాడి చేయడానికి వచ్చిన మొసలిని మాత్రం విజయవంతంగా తరిమి కొట్టాడు ఆ పెద్దాయన.. ఇంతకీ ఇక ఈ వీడియో పబ్జి ప్రియులకు ఎందుకు నచ్చుతుంది అంటారా.. పబ్జి గేమ్ లో కూడా ఇలా పెనంతో శత్రువులపై దాడి చేయడం వాళ్ళని తరిమి కొట్టడం లేదా చంపేయడం లాంటివి ఉంటాయి. ఇక అందుకే ఈ వీడియో చూడగానే ముసలాయన మొసలితో పబ్జి ఆడాడు అంటూ ఎంతోమంది పబ్జి ప్రియులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.