
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఎలా ఉంటాయి అన్నదానికి నిదర్శనంగా ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా భార్యాభర్తలు అంటే గల్లీ గజాలు, అలకలు, కోపతాపాలు ఎంతో కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఒకరిపై ఒకరు చూపించే ప్రేమను రాగాలకు అయితే మాటల్లో వర్ణించడం చాలా కష్టం. అయితే కొన్ని కొన్ని సార్లు ఏకంగా భార్యాభర్తలు ఒకరిని ఒకరు ఆటపట్టించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా భార్యాభర్తల మధ్య ఎంత అన్యోన్యత ఉంది అన్నదానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయని చెప్పాలి.
ఇక ఇంతకీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముంది అంటారా.. ఇక్కడ ఓ వ్యక్తి తన భార్యపై ప్రేమ చూపించిన తీరు అందరిని నవ్వుకునేలా చేస్తుంది. వీడియోలో చూసుకుంటే భర్త భోజనం చేసి చేయి కడుక్కునేందుకు వాష్ బేసిన్ వద్దకు వెళ్తాడు. అదే సమయంలో అక్కడ భార్య గిన్నెలను శుభ్రపరుస్తూ ఉంటుంది అయితే అతడు హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చేతులు తడిగా ఉన్నాయి తుడుచుకోవడం ఎలా అని ఆలోచిస్తాడు. దీంతో భార్యను దగ్గరికి తీసుకొని ప్రేమగా నిమిరి కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత ఇక వెనకనుంచి తన చేతులను భార్య టీ షర్ట్ కి తుడుచేస్తాడు. ఈ విషయం తెలియని భార్య తన భర్త చూపించిన ప్రేమకు మురిసిపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ఇది చూసి ఇది ఎక్కడి ప్రేమ సామీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.