సాధారణంగా మావోయిస్టులు తమకు రక్షణగా ల్యాండ్ మైండ్స్ ని వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తమ దగ్గరికి పోలీసులు రాకుండా తాము ఉండే ప్రాంతం చుట్టుపక్కల ల్యాండ్ మైన్స్ భూమిలో పాతి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ పోలీసులు కానీ లేదా ఇతర వ్యక్తులు ఎవరైనా చూడకుండా ల్యాండ్ మైన్స్ పై కాలు వేశారు అంటే చాలు భారీ పేలుడు సంభవించి ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటివి చాలామంది నేరుగా చూడకపోయినప్పటికీ అటు ఇప్పటివరకు చాలానే సినిమాల్లో చూసారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.


 ఇక ల్యాండ్ మైన్స్ పేలుడుకు సంబంధించిన సన్నివేశాలను చూసినప్పుడు నిజంగానే ల్యాండ్ మైన్స్ కారణంగా ఇంతటి విధ్వంసం జరుగుతుందా అని అందరూ ఆలోచనలో పడిపోతూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు ఇక దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ల్యాండ్ మైన్ పేలితే ఎంతటి విధ్వంసం జరుగుతుంది అన్నదానికి నిదర్శనంగా ఈ వీడియో నిలిచింది అని చెప్పాలి. మావోయిస్టు రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రస్తుతం పోలీసులు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి అడవుల్లో జల్లడ పడుతున్నారు.


 ఈ క్రమంలోనే పోలీసులను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్ ను ఎంతో చాకచక్యంగా నిర్వీర్యం చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం వద్దిపేట - మోసుగుప్ప రహదారిపై మావోయిస్టులు 15 కేజీల ల్యాండ్ మైన్ అమర్చారు. అయితే ఇక దీనిని గుర్తించిన పోలీసులు బాంబు స్క్వాడ్ సాయంతో దానిని వెలికి తీసి అనంతరం మందు పాతరను నిర్వీర్యం చేశారు. ఇక ఈ క్రమంలోనే ఆ బాంబు పేలుడు దాటికి భూమి పైనే భారీ గొయ్యిపడింది. ఇది చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: