సాధారణంగా నిద్రపోతున్నప్పుడు ఇక శరీరంపై ఏదైనా పాకుతున్నట్లు అనిపించిందంటే చాలు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. అలాంటిది ముక్కు చెవి రంధ్రాల్లోకి ఏదైనా కీటకం వెళ్తుంది అని తెలిస్తే వెంటనే మెలుకువ వచ్చేస్తూ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం ఏకంగా  చనిపోయిన శవంలాగే నిద్రపోతూ ఉంటారు. పక్కన ఏం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా అస్సలు పట్టించుకోరు. ఇక తమ మీద ఏదైనా పాకుతున్న కూడా పెద్దగా స్పర్శ లేనట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు.


 చెవి, ముక్కులోకి ఏదైనా కీటకాలు ప్రవేశించినప్పుడు కూడా ఇక ఏం జరగలేదు అన్నట్లుగానే సాధారణంగా నిద్రలో మునిగిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. చాలా తక్కువ మంది మాత్రమే ఇక ఇలా ఉంటారు. ఇక్కడ ఒక మహిళ అంతకుమించి అనే రేంజ్ లోనే నిద్రపోయిందో ఏమో పాపం ఊహించిన రీతిలో ఆ మహిళలకు  ప్రమాదం ఎదురైంది. గతంలో ఏకంగా బాలిక చెవిలో పాము ప్రవేశించగా దానిని అతి కష్టం మీద వైద్యులు బయటకు తీసిన ఘటన వైరల్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా మరో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.


 ఏకంగా ఒక మహిళ నోటిలోకి పాము దూరింది. ఇక కడుపులోకి వెళ్లి నానా రచ్చ చేసింది. దీంతో ఇక సదరు మహిళ హాస్పిటల్ కి పరుగులు పెట్టింది. జరిగిన విషయం తెలిపింది. దీంతో స్కానింగ్ చేసి చూసిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో పాము నోట్లోకి ప్రవేశించిందని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అతి కష్టం మీద ఆ పామును బయటకు తీశారు. అయితే ఇక ఆ పామును బయటకు తీసిన డాక్టర్ సైతం ఇంత పెద్ద పాము ఎలా లోపలికి దూరిందా అని షాక్ అయింది. ఇక పామును బయటకు తీసే సమయానికి అది ఇంకా ప్రాణాలతోనే ఉండడం గమనార్హం. ఇక ఈ వీడియో చూసి నేటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: