
అయితే రోడ్డు ప్రమాదాలు అంటే కేవలం ప్రాణాలు పోవడం మాత్రమే అని అందరూ అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు రోడ్డు ప్రమాదాలు ఏకంగా నవ్వులు కూడా పూయిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఆడవాళ్లకు కోపం వస్తే తప్పు తమదే అయినా సరే పక్క వాళ్ళపై అరుస్తూ ఉంటారు అని ఇప్పుడు వరకు ఎన్నోసార్లు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఇందుకు నిదర్శనంగా మారిపోయిన వీడియో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.
ఇక ఇటీవలే వైరల్ గా మారిపోయిన వీడియోలో చూస్తే ఒక యువతి ఏకంగా స్కూటీ డ్రైవింగ్ సరిగా నేర్చుకోకుండానే రోడ్డుపైకి వచ్చింది. ఈ క్రమంలోనే వేగంగా నడుపుకుంటూ వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక బైక్ను ఢీ కొట్టింది.. సాధారణంగా ఇలా బైక్ను ఢీకొట్టిన సమయంలో యువతి సారీ తప్పయింది మన్నించండి అంటూ బ్రతిమిలాడటం చేస్తూ ఉండాలి. కానీ అక్కడ స్కూటీతో బైక్ను ఢీ కొట్టిన యువతి మాత్రం.. చూసి డ్రైవింగ్ చేయలేవా నువ్వు గుడ్డివాడివా అంటూ నోటికి వచ్చినట్లు బైక్ పై ఉన్న వ్యక్తిని తిట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోవడంతో ఆ యువతి కోపాన్ని చూసి అందరూ నవ్వుకుంటున్నారు.