అయితే కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువుల్లో కూడా తల్లి ప్రేమకు ఏది సాటిరాదు అన్నదానికి నిదర్శనంగా ఇప్పటివరకు ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి నేటిజన్ల మనసును హత్తుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. తల్లి ప్రేమకు మనుషులే కాదు జంతువులు కూడా అతీతం కాదు అన్నదానికి నిదర్శనంగా నిలిచింది ఈ వీడియో. సాధారణంగానే చింపాంజీలు మనుషుల లాగానే కాస్త ఎక్కువ తెలివి కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే మనుషులు మాదిరిగానే హవాభావాలను వ్యక్తపరుస్తూ ఉంటాయి.
వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక తల్లి చింపాంజీ తన బేబీ చింపాంజీని కలుసుకున్న సమయంలో ఏకంగా చూపించిన ప్రేమ హృదయాన్ని మెలిపెట్టేస్తుంది అని చెప్పాలి. సి సెక్షన్ ద్వారా చింపాంజీకి బిడ్డ జన్మించింది. అయితే ప్రసవం తర్వాత చింపాంజీని వైద్యులు రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచారు. దీంతో తన బిడ్డను కనీసం ఒక్కసారైనా చూడలేకపోయాను అనే బాధ ఆ చింపాంజీలో అలాగే ఉండిపోయింది. రెండు రోజుల తర్వాత తన బిడ్డను కళ్ళ ముందుకు తెచ్చి ఇవ్వడంతో వెంటనే కౌగిలించుకుంది. ఇక ఎంతగానో మురిసిపోయింది చింపాంజీ.