అయితే సోషల్ మీడియాలో ఏనుగులకు సంబంధించిన వీడియోలు ఏమైనా వెలుగులోకి వచ్చాయి అంటే అవి క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. కొన్ని కొన్ని సార్లు అడవుల్లో ఉండే ఏనుగుల గుంపులు జనావాసాల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించడం లేదా ఏకంగా పంట పొలాలను నాశనం చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఇటీవలే అస్సాంలోని గోల్ పరాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఓ ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం నుంచి వచ్చి నివాస ప్రాంతాలకు చేరుకుని పంటలు మొత్తాన్ని ధ్వంసం చేసింది.
అయితే ఇలా చేతికి వచ్చిన పంటను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును తరిమికొట్టేందుకు స్థానికులు ఎంతగానో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన ఒక ఏనుగు ఏకంగా స్థానికులపై దాడి చేసేందుకు పరుగులు పెట్టింది. దీంతో ఇది చూసిన స్థానికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఇక పరుగులు పెట్టారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఏనుగుల గుంపు ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయంతో వనికి పోయారు అని చెప్పాలి.