
ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా చిన్నారులు కల్మషం లేని మనసుతో ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పెద్దవాళ్ల లాగా కుళ్ళు కుతంత్రాలు చిన్నవాళ్ళ మనసులో అస్సలు ఉండవు అని అంటూ ఉంటారు ఇది నిజమే అన్న విషయాన్ని నిరూపించేందుకు ఎన్నో వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే వైరల్ గా మారింది. సాంతరణంగా కళ్ళ ముందు ఒక నాటు కోడిపుంజు కనిపించింది అంటే దాని ఎలా వండుకొని తినాలా అని ఆలోచిస్తూ ఉంటారు అందరూ.
ఇక్కడ ఒక బుడ్డోడు మాత్రం ఏకంగా తాను ఆడుకుంటున్న సమయంలో కోడిపుంజు కనిపించడంతో ఏకంగా తన బండిలోకి కోడిపుంజును ఎక్కించుకొని లిఫ్ట్ ఇచ్చాడు. చిన్న సైకిల్, ఒక లారీ బొమ్మతో ఇంటి ముందు ఆడుకుంటున్నాడు పిల్లోడు. ఇంతలో అతనికంట కోడిపుంజు పడింది. అయితే దానిని తన లారీపై లిఫ్ట్ ఇచ్చి తీసుకువెళ్లాడు. ఇక ఆ కోడిపుంజు కూడా ఎలాంటి భయం లేకుండా ఆ లారీపై నిలబడి ఉంది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త తల్లిదండ్రులు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో మనసుకు ప్రశాంతతను కలిగిస్తుందని ఎంతోమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.