వారి వేషధారణలో అయినా లేకపోతే వారు పట్టుకున్న ఫ్లకార్డులో అయినా ఏదో ఒకటి కొత్తగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఇక ఇలా ఎవరైనా చేశారంటే చాలు అభిమానులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలా ఒక అభిమాని ఎవరు ఊహకందని విధంగా వినూత్నంగా ఆలోచించిన ఒక వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా అద్దాలతో నిండిపోయిన దుస్తులను ధరించి స్టేడియంలో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన అభిమాని అందరిని ఆశ్చర్యపరిచాడు. బ్రెజిల్ కు చెందిన ఈ అభిమాని ధరించిన దుస్తులు ఎంతో విభిన్నంగా ఉన్నాయి అని చెప్పాలి. దీంతో రోబో సినిమాలు పక్షిరాజులా ఉన్నాడని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు అని చెప్పాలి.
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. రంగు రంగుల అద్దాలు ఉన్న దుస్తులను ధరించి స్టేడియం కు రావడంతో పక్కనే ఉన్న మిగతా ప్రేక్షకులు అందరూ కూడా అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు అతనితో ఒక సెల్ఫీ తీసుకోవడం కోసం ఆసక్తి చూపించారు అని చెప్పాలి. ఇలా స్టేడియం మొత్తం కలియతిరిగిన అభిమాని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయాడు. అతని వీడియో తీసిన ఒక వ్యక్తి ఇక ఇది ట్విటర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయి అందరిని ఆశీర్వదిస్తుంది. ఇటీవల సెమీఫైనల్ లో క్రొయేషియా బ్రెజిల్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో బ్రెజిల్ ఓడిపోయి టోర్ని నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే.