సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా అనేది మొదటి వరుసలో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒక్కసారి కింగ్ కోబ్రా దాడి చేసింది అంటే చాలు కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతూ ఉంటాడు మనిషి. అయితే దీని విషం మాత్రమే కాదు ఇక దీని రూపురేఖలు కూడా చూడ్డానికి అంతే భయంకరంగా ఉంటాయి. అయితే సాధారణంగా భారత్ లో కింగ్ కోబ్రాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో సైతం కింగ్ కోబ్రాలు ప్రత్యక్షమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతున్నాయి అని చెప్పాలి.


 అయితే నాలగు పాములు తరచూ అటు జనావాసాల్లోకి వస్తూ ఉంటాయి. కానీ కింగ్ కోబ్రాలు జనావాసాల్లోకి రావటం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం అని చెప్పాలి.  ఇక ఇలా జనావాసాల్లోలోకి వచ్చిన సమయంలో స్థానికులు వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్లను పిలుస్తూ ఇక ఆ పాములను పట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. అలాంటి కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కరలు కొడుతుంది అని చెప్పాలి.


 ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురిచేస్తుంది. వీడియోలో ఏముందంటే.. ఒక వ్యక్తి ఆవరణలో చిన్నపిల్లవాడు ఎంతో సరదాగా ఆడుకుంటున్నాడు. అంతలో ఊహించని విధంగా ఒక భారీ కింగ్ కోబ్రా నెమ్మదిగా పాకుకుంటూ పిల్లాడి వైపు వచ్చింది. అయితే సాధారణంగా పాములను చూస్తే చిన్నారులు భయపడుతూ ఉంటారు. ఈ వీడియోలో మాత్రం ఆ చిన్నారి కింగ్ కోబ్రాకు ఎక్కడ భయపడలేదు. అంతే కాదు ఆ పాము తలను పట్టుకుని పక్కకు నెట్టడం లాంటివి చేశాడు. ఇక ఈ వీడియో చూస్తున్నంత సేపు ఎక్కడ ఆ కింగ్ కోబ్రా ఆ పిల్లాడిని కాటు వేస్తుందేమో అని భయం నేటిజన్స్ కి కలుగుతుంది అని చెప్పాలి. చివరికి కింగ్ కోబ్రా ఆ పిల్లాడిని ఏం చేయకుండానే అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఇక ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: