సాధారణంగా సామాన్య ప్రజలకు ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు పోలీసులు ఉన్నారు అన్న ధీమాతో ఉంటారు. ఇక ఏ కష్టం వచ్చినా పోలీసులు అండగా నిలుస్తారు న్యాయం చేస్తారు అన్న ధైర్యంతోనే ఉంటారు ప్రజలు.  అయితే ఇక ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు సహా మరికొన్ని రకాలు వేధింపులనూ రూపుమాపేందుకు  అటు ఎంతో మంది మహిళా పోలీసుల సైతం నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా చట్టాన్ని కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే కష్టం వస్తే ఇక్కడ ఒక మహిళ ఎస్సై కి ఇలాంటి అనుభవమే ఎదురయింది.


 సాధారణంగా మహిళ ఎస్సైగా ఉన్నవారు ఇక మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎప్పుడు ముందుంటారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను రూపుమాపేందుకు తమ వంతు కృషి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మహిళలకు రక్షణ కల్పించే ఎస్ఐకే చివరికి భర్త నుంచి రక్షణ లేకుండా పోయింది. తన భర్త తనను దారుణంగా కొడుతున్నాడు అంటూ ఓ మహిళ ఎస్సై వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయగా ఇది కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఢిల్లీ పోలీసు విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న ఓ మహిళను ఆమె భర్త తీవ్రంగా కొట్టాడు. గతంలో కూడా దారుణంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇలా నిత్యం తన భర్త తాగి వచ్చి గొడవ పడుతూ ఉంటాడని తెలిపింది ఆమె. మహేంద్ర పార్క్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తుంది సదరు మహిళా అధికారి. భర్త తరుణ్ మద్యం మత్తులో  కొందరు అనుచరులతో  కలిసి వచ్చి దాడికి పాల్పడ్డాడు  ఆమె సోదరిపై కూడా దాడి చేశాడు. సదరు మహిళ ఎస్సై పోస్ట్ చేసిన వీడియోలో కూడా ఏకంగా భర్త దారుణంగా ఆమెపై దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన భర్త పై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసింది సదరు మహిళా.

మరింత సమాచారం తెలుసుకోండి: