ఇటీవల కాలంలో ఏదో ఒక విచిత్రమైన పని చేసి చివరికి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని ఎంతోమంది అనుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాపులారిటీ కోసం కొంతమంది ఏకంగా ప్రాణాలను సైతం రిస్కులో పెట్టుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో యూట్యూబ్లో ఫ్రాంక్ వీడియోలకు కాస్త డిమాండ్ ఎక్కువగా ఉంది. ఫ్రాంక్ వీడియోలను ఎవరు చేసినా కూడా చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు నేటిజన్స్.


 దీంతో బయట ఉన్న వారితో ఫ్రాంక్ వీడియోలు చేయడమే కాదు ఏకంగా ఇంట్లో వాళ్ళతో కూడా కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఫ్రాంక్ వీడియోలు చేయడం లాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది అయితే ఏకంగా భార్యలను ఆట పట్టించడానికి.. విచిత్రమైన వేషధారణతో భయపెట్టడం చేసి ఫ్రాంక్ చేయడం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం భార్యతో ఫ్రాంక్ వీడియో చేయడం ఎంత ప్రమాదకరమో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.


 ఇక అందరూ చేసినట్లుగానే ఇక్కడ ఒక వ్యక్తి కూడా తన భార్యను ఫ్రాంక్ చేసి భయపెట్టాలని చూశాడు. విచిత్రమైన వేషధారణతో గోడ పక్కన నిలబడి అక్కడికి రాగానే గట్టిగా అరిచాడు. దీంతో భార్య భయపడి పోతుంది అని అనుకున్నాడు. కానీ సీన్ కాస్త రివర్స్ అయింది. భర్త విచిత్రమైన వేషధారణతో గట్టిగా అరవగానే అక్కడ ఉంది భర్త కాదు ఇంకెవరో అనుకుని తన చేతిలో ఉన్న సుత్తితో దాడి చేస్తుంది. అయితే కాస్తలో మిస్ అయి అది పక్కనే ఉన్న అద్దానికి తగిలి పగిలిపోతుంది. దీంతో ఇక ఇది చూసిన భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. హమ్మయ్య ప్రాణాలు దక్కాయి అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఈ వీడియో చూశాక భార్యలతో ఫ్రాంక్ వీడియోలు చేయాలంటేనే మిగతా వాళ్ళు భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: