సాధారణం గా రద్దీగా ఉండే రహాదారులపై వాహనాదారులు పెద్దగా ఎలాంటి శబ్దాలను పట్టించుకోరు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏదైనా వింత శబ్దం వినిపించిన కూడా తమ దారిన తాము వెళ్లిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది వాహనదారులు మాత్రం ఇలా ఏవైనా వింత శబ్దాలు వస్తే ఏంటా అని వెళ్లి చూడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలా వెళ్లి చూసినప్పుడు ఎన్నో ఊహించని ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అది ఒక రద్దీ రహదారి.


 ఎప్పటి రాగానే ఇక రోడ్డు మొత్తం వాహనాల రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే రోడ్డు పక్కన ఉన్న కాలువ నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. అయితే మొదట శబ్దాలు చిన్నగా రావడంతో ఇక వాహనదారులు పెద్దగా పట్టించుకోలేదు. ఆ శబ్దాలు ఎక్కువ కావడంతో అక్కడ ఏం జరిగిందో అని తెలుసుకోవాలని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కోజీ కోడ్ లో కొండచిలువలు కలకలం సృష్టించాయి.



 స్థానిక కరప రంబ శివారు ప్రాంతం లోని కానోలి కాలువ లో ఆరు కొండ చిలువలు ప్రత్యక్షం కావడంతో ఇది చూసి స్థానికులందరూ భయాందోళనకు గురయ్యారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులకు వింత శబ్దాలు వినిపించడంతో ఏంటా అని రోడ్డుపక్కన ఉన్న కాలువలో చూసి ఒక్కసారిగా కంగుతున్నారు. దీంతో ఇక అక్కడ భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది అని చెప్పాలి. ఇక సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని కొండచిలువలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇకపోతే ఆహారాన్ని వెతుక్కుంటూ కొండచిలువలు అడవి నుంచి బయటకు వచ్చాయని అధికారులు అంచనా వేశారు. ఇక వాటిని  సురక్షిత ప్రాంతానికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: