ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి వాటిలో కొన్ని వీడియోలు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటే మరికొన్ని వీడియోలు మాత్రం అందరిని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఎంతో మంది అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇలా మంచి డాన్స్ స్టెప్పులతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదిస్తున్నారు.


 ఇక మరి కొంతమంది మాత్రం డాన్స్ అనే పదానికి సరికొత్త అర్ధాన్ని చెబుతూ చిత్ర విచిత్రంగా డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఇలా వెరైటీ డాన్స్ కు సంబంధించిన వీడియో ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అందరి దృష్టి అటువైపే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే చాలు ఎంతో మంది యువకులు డాన్స్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక అందరిలాగానే ఇక్కడ ఒక యువకుడు కూడా డాన్స్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని డాన్స్ చూస్తే అక్కడ ఉన్న వారందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇది చూసి ఇదేం డాన్స్ సామి అమ్మాయి జడుసుకుంది అంటూ ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు వరకు నాగిని డాన్స్ మూర్చ వచ్చినట్లుగా చేయడం లేదా ఏకంగా భూమి మీద దొర్లుతూ పంట చేనులోకి వెళ్లిపోవడం లాంటివి డాన్సులు చూసారు. కానీ ఇది మాత్రం మరింత వెరైటీగా ఉంది అని చెప్పాలి. ఇది చూస్తే నవ్వు ఆపుకోలేరు ఎవరైనా. ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో భాగంగా మహిళా డాన్సర్ అతని డాన్స్ చేసేందుకు ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆహ్వానం అందటమే ఆలస్యం అన్నట్లుగా స్టేజ్ మీదకి చేరుకున్న యువకుడు విచిత్రమైన డాన్స్ తో ఆ అమ్మాయిని భయపెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: