
అంతేకాదు ఎంతోమంది వధూవరులు సినిమా రేంజ్ లో ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి ప్రయత్నాలు చేయడానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు వధూవరులు. అంతలో ఒక్కసారిగా వరుడు వధువు కళ్ళల్లోకి చూశాడు. ఇంకేముంది ఢమాల్ అంటూ పడిపోయాడు. పడిపోయాడు అనగానే ఆ వధువుతో ప్రేమలో అనుకునేరు. ఏకంగా కింద పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
జైపూర్ లో ఒక నూతన జంట ప్రీ వెడ్డింగ్ షూట్ లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్లు చెప్పినట్లుగానే ఒక స్టేజి మీద ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంది. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్ల రేంజిలో వధూవరులు ఫోటోకి ఫోస్ ఇవ్వాలని అనుకున్నారు. కాస్త రొమాంటిక్ గా ట్రై చేశారు. ఇంతలో వరుడు వధువు లేహంగాపై కాలువేసి తడబడ్డాడు. దీంతో ఉన్నటువంటి వధువుపై పడిపోయాడు. ఆ బరువు ఆపుకోలేక వధువు కూడా కింద పడిపోయింది. దీంతో అక్కడ జరిగింది చూసి ఫోటోగ్రాఫర్లు కాసేపు నవ్వుకున్నారు అని చెప్పాలి.