ఇటీవల కాలం లో నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితేఎంతలా సీసీ కెమెరాలు పెట్టినప్పటికీ అటు నేరస్తులు మాత్రం రోజురోజుకు రెచ్చిపోతున్నారు తప్ప ఎక్కడ వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా ఎంతోమంది నేరాలకు పాల్పడుతున్న వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డు అయి చివరికి సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇవి చూసి షాక్ అవడం అటు నైటిజన్స్ వంతు అవుతుంది అని చెప్పాలి.



 ఇటీవల హర్యానా లోని యమునా నగర్ లో కూడా ఇలాంటి ఓ నేరానికి సంబంధించిన వీడియో కాస్త ట్విటర్ వేదికగా వైరల్ గా మారి పోయింది అని చెప్పాలి  ఏకంగా జిమ్ కు వెళ్లిన యువతి అందులో వ్యాయామం పూర్తి చేసుకుని బయటకు వచ్చి కార్ లోకి వచ్చింది. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన నలుగురు దుండగులు కూడా పక్క ప్లాన్ ప్రకారం ఇక యువతి కూర్చున్న కారులోకి ఎక్కి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. గుర్తు తెలియని దుండగులు కారులోకి రావడంతో ఒక్కసారిగా యువతి షాక్ అయింది. మొదట ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. కానీ తర్వాత తీవ్రంగా ప్రతిఘటించింది.


 గట్టిగా అరుస్తూ.. ఇక కారులోకి ఎక్కిన దుండగులను కూడా కొట్టింది అని చెప్పాలి. దీంతో యువతి ప్రతిఘటించడం తో భయపడి పోయిన నలుగురు దుండగులు వెంటనే కారు లో నుంచి దిగి అక్కడి నుంచి పారి పోయారు. ఇక ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని యువతి జరిగిన విషయాన్ని చెప్పి కేసు నమోదు చేసింది. ఘటనపై ఇక విచరణ ప్రారంభించిన పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమం లోనే ఎందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: