
కేవలం అడవుల్లోకి వెళ్ళినప్పుడే కాదు అడవుల మధ్యలో నుంచి ఉండే రహదారిపై వాహనంపై వెళ్తున్న సమయంలో కూడా ఇక అడవుల్లో ఉండే జంతువులు రోడ్డుపై తారసపడటం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఇక్కడ ఒక వ్యక్తి కారులో అడవి మధ్యలో ఉన్న రహదారి గుండా వెళుతూ ఉన్నాడు. అప్పటికే అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఎటువైపు నుంచి ఏ జంతువు వస్తుందో అని భయం గానే వాహనాన్ని నడుపుతూ ఉన్నాడు.
ఇంతలో ఊహించని షాక్. ఏకంగా ఒక భారీ ఆకారం తన కార్ లైట్ ఫోకస్ లో కనిపించింది. మొదట అక్కడ ఉన్నది ఏంటో అతనికి అర్థం కాలేదు. కాస్త దగ్గరికి వెళ్లి చూసె సరికి అక్కడ ఉన్నది ఒక భారీ ఏనుగు తో పాటు దాని పిల్ల అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇలా భారీ ఏనుగు తన బిడ్డతో కలిసి రోడ్డు దాటుతుంది. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి ఒక్కసారిగా తన కారును అక్కడే ఆపేసాడు. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది. కానీ తనకు తాను కాస్త ధైర్యం తెచ్చుకొని ఇక ఏనుగులు రోడ్డు దాటిన తర్వాత వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటన కర్ణాటకలోనే బెంగళూరు దండేలి ప్రాంతంలో వెలుగు చూసింది.