
సుప్రియ సాహు అనే ఐఏఎస్ ఈ వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ వీడియో అడవి ప్రాంతం లో తీసింది. ఏనుగుల మంద అడవి లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుంది. అకస్మాత్తు గా వారు వెళ్లే దారి లో రహదారి వస్తుంది. మనుషులు తమ ప్రయోజనం కోసం అడవిని ధ్వంసం చేసి, రోడ్లు వేశారు. ఈ కారణంగా జంతువులు రహదారిని దాటు తున్నప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఒక తల్లి తన బిడ్డతో ముందుకు వెళ్ళినప్పుడు ఏనుగుల మంద ఆగి పోతుంది. రోడ్డు దాటడం బహుశా పిల్ల ఏనుగుకు కొత్త కావొచ్చు. దీంతో రోడ్డు ఎలా దాటా లో తెలియక అది ఆగి పోతుంది. వెంటనే తల్లి ఏనుగు అక్కడకు వస్తుంది. తన బిడ్డకు ఏదో చెప్తున్నట్లు అనిపిస్తుంది. తర్వాత దగ్గరుండి తన బిడ్డను రోడ్డు దాటిస్తుంది. రోడ్డు ఎలా దాటాలో తెలుపుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లు బాగా ఆకర్షిస్తోంది. మనుషులైనా, జంతువులైనా బిడ్డలకు తల్లి మాత్రమే మొదటి ఉపాధ్యాయుడని, ప్రపంచం లో ఎలా బ్రతకాలో తల్లే తెలియ జేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.