సాధారణంగా పాములు అంటే ప్రతి ఒక్కరికి భయమే. అందుకే పాము ఎక్కడైనా కనిపించిందంటే చాలు అక్కడి నుంచి పరుగో పరుగు అంటారు ప్రతి ఒక్కరు. అది విషపూరితమైన పాము కాకపోయినప్పటికీ ఎందుకో పామును చూడగానే గుండెల్లో ఏదో తెలియని భయం పుడుతూ ఉంటుంది. అందుకే ఎటువైపు అయినా పాములు ఉంటాయని ఎవరైనా చెబితే.. అటువైపు వెళ్లడమే మానేస్తూ ఉంటారు. అయితే ఇలా డైరెక్ట్ గా పాములను చూడడానికి వాటికి దగ్గరగా వెళ్లడానికి భయపడే జనాలు అటు సోషల్ మీడియా కారణంగా మాత్రం పాములకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.


 ఈ క్రమంలోనే ఎన్నో రకాల విషపూరితమైన పాములు ఎలా దాడి చేస్తాయి. వాటి జీవన శైలి ఎలా ఉంటుంది అనే విషయాలను తెలిపే విధంగా ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలాంటి వీడియోలు ఎప్పుడూ ఇంటర్నెట్ ని షేర్ చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాగే రెండు భారీ పాములకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ముందుగా కొంతమంది రెస్క్యూ సిబ్బంది పామును పట్టుకునేందుకు ఒక ఇంట్లోకి వెళ్తారు. అయితే ఆ పాము ఇంటి పైకప్పు పై దూరుతుంది. ఇక వీడియోలో మొదట పాము తోక మాత్రమే కనిపిస్తుంది.


 అదేదో చిన్న పాము అయి ఉంటుందని ఈ వీడియో చూడగానే ప్రతి ఒక్కరి మనసులో భావన కలుగుతుంది.  కానీ సెకండ్ల వ్యవధిలోనే ఆ పైకప్పు మొత్తం ఊడిపోతుంది. దీంతో అందులో నుంచి రెండు భారీ పాములు బయటపడతాయి. ఇక ఇది చూడగానే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి. చిన్నపాము అనుకున్నాము కానీ ఇంత భారీ పాములు రెండు ఉన్నాయా అని ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. అయితే ఇక ఈ రెండు భారీ పాములను కంట్రోల్ చేసేందుకు వచ్చిన స్నేక్ క్యాచర్లు సైతం ఎంతగానో ఇబ్బంది పడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ రెండు భారీ పాములను చూసి వారిలో కూడా భయం పుట్టింది అని చెప్పాలి.  ఇక ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: