ప్రస్తుత కాలంలో అయితే దేశాంతర ప్రేమలు ఇంకా పెళ్లిళ్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇక నేటి యువతకి కూడా ఇవేమి కొత్తేమీ కాదు. అయితే అలాంటి వాటికి కొన్ని కొన్ని సందర్భాలలో పెద్దలు అభ్యంతరం చెప్పినా కానీ ప్రభుత్వం నుంచి మాత్రం అసలు ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. అయితే పాకిస్థాన్‌కు చెందిన ఒక అమ్మాయి సరిహద్దులు దాటి వచ్చి మరీ భారత యువకుడ్ని ప్రేమించి పెళ్లాడి.. ఇక్కడే ఉండిపోయే ప్రయత్నం చేసింది. ఆమె అలా చేయగా, అధికారులు ఆమెను తిప్పిపంపిన వైనం కూడా జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన ఇఖ్రా జీవానీ వయసు 19 సంవత్సరాలు. ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడుతుండగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ములాయం సింగ్(26) అనే యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. కొద్దిరోజుల్లోనే ములాయంతో ఇఖ్రా పీకల్లోతు ప్రేమలో పడింది. ఇక అతన్ని ఎలాగైనా పెళ్లి చేసుకుందామని ఏకంగా సరిహద్దులు దాటి మరీ ఇండియాకి వచ్చింది.


అయితే ఆమె తనకు వీసా లేకపోవడంతో ములాయం సలహా మేరకు మొదట నేపాల్ చేరుకుంది. ఇక అలా ఖాట్మండులో ములాయం ఆమెను కలుసుకున్నాడు.ఇంకా ఇద్దరూ అక్కడే పెళ్లి చేసుకుని అక్కడ సరిహద్దుల్లోని సనోలీ ప్రాంతం నుంచి ఇండియాలో ప్రవేశించారు. ములాయం కొన్నేళ్లుగా బెంగళూరులో ఉంటున్న నేపథ్యంలో అక్కడే కాపురం పెట్టాలని వారిద్దరూ కూడా నిర్ణయించుకున్నారు.ఇఖ్రా తన పేరును హిందూ పేరును తలపించేలా రవా అని మార్చుకోవడం జరిగింది.అయితే ఇక ఆమె నమాజ్ చేస్తుండడంతో ఇరుగు పొరుగు వారికి వెంటనే అనుమానం వచ్చింది. దాంతో వారు దెబ్బకు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసులు ఇఖ్రాను అరెస్ట్ చేసి ఆమె పాస్ పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ అసలు విషయం తెలియడంతో ఆమెను పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు తరలించారు. ఆ తరువాత అట్టారీ బోర్డర్ నుంచి ఆమెను పాక్‌కు తిప్పి పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: