అయితే సూసైడ్ చేసుకోవడానికి కాదు ఏకంగా ఒక ప్రాణం కాపాడటానికి ఇలా రైలు పట్టాల పైకి దిగాడు సదరు వ్యక్తి. ఇక ఇలా ఎవరైనా పట్టాలపైకి దిగితే అందరూ కూడా అతనికి ఏం జరుగుతుందో అని ఆలోచిస్తారు. కానీ అక్కడ ఫ్లాట్ ఫారం పైన ఉన్న జనం మాత్రం అతని గురించి కాదు అదే ప్లాట్ఫారం మీద ఉన్న కుక్కకు ఏం జరుగుతుందో అని ఆలోచించారు. ఈ ఘటన రద్దీగా ఉండే ముంబైలో జరిగింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒక రైల్వే స్టేషన్ లో చాలామంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఆ స్టేషన్లో రైలు పట్టాలపై ఒక కుక్క దిగింది. అయితే అంతలోనే రైలు ముందుకు కదిలింది. ఈ క్రమంలోనే అదే ఫ్లాట్ ఫారం పై ఉన్న ఒక వ్యక్తి ఇది గమనించాడు. వెంటనే పట్టాల వద్దకు వెళ్లాడు. కుక్కను రక్షించేందుకు ప్రయత్నించాడు. మరోవైపు రైలు మెల్లగా కదులుతూ వచ్చింది. ఆ వ్యక్తి రైలు రాకను పెద్దగా పట్టించుకోలేదు. కుక్కను కాపాడటం పైన దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న మిగతా ప్రయాణికులు అందరూ కూడా రైలు ఆపాలంటూ కేకలు వేయడంతో గమనించిన డ్రైవర్ ట్రైన్ స్లో చేశాడు. ఇంతలో వ్యక్తి కుక్కను పట్టుకొని ప్లాట్ ఫారం పైకి తెచ్చాడు. దీంతో రైలు మళ్లీ స్పీడ్ పెంచి ఇక ప్లాట్ఫారం నుంచి దూసుకుపోయింది.