సాధారణంగా అడవుల్లో ఉండే క్రూర మృగాలైన పులులు,  సింహాలకు సంబంధించిన వీడియోలు ఏవైనా సోషల్ మీడియాలోకి వచ్చాయి అంటే చాలు అవి నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్ గా.. పులులు సింహాలను చూసేందుకు సాహసం చేయని ఎంతోమంది ఇక వాటి జీవన శైలి ఎలా ఉంటుంది.. ఆహారం సంపాదించుకునేందుకు పులులు, సింహాలు ఎంత దారుణంగా వేట కొనసాగిస్తాయి అన్న విషయాలను ఇక సోషల్ మీడియాలోకి వచ్చే వీడియోల ద్వారా తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. అందుకే ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియాలోకి వస్తే అది ఇంటర్నెట్ ను షేక్ చేస్తూ ఉంటుంది.


 సాధారణంగా పులులు, సింహాలు అటు అడవుల్లో ఉండే అన్ని జీవుల కంటే ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి అన్న విషయం అందరికీ తెలుసు. ఇక వాటికంటే భారీ ఆకారం ఉన్న జంతువులను సైతం ఎంతో అలవోకగా వేటాడి ఇక ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయ్. కొన్ని కొన్ని సార్లు ఇక పులులు సింహాలు వాటి కంటే తక్కువ బలం కలిగి ఉన్న చిరుత పులులు లాంటి వాటిని కూడా దారుణంగా వేటాడటం లాంటివి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. కానీ ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక ఇటీవల ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఒక చిరుత పులిని ఒక భారీపులి వేటాడేందుకు ప్రయత్నించింది. చెట్టుపై ఉన్న చిరుతను పులి దూరం నుంచి  గమనిస్తూ ఉంటుంది. అయితే చిరుత చెట్టు నుంచి కిందికి దిగగానే పులి దాన్ని వెంబడిస్తుంది. అయితే రెండు దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం ఒకదానితో ఒకటి పరస్పరం తలపడలేదు. కొద్దిసేపటి వరకు ఒక్కదానిని మరొకటి చూసుకున్నాయి అని చెప్పాలి. చిరుత భయపడి పారిపోకుండా తనను తాను కాపాడుకోవడానికి ఇక పులిని ఎదిరించడానికి వెను తిరగడంతోనే పులి వెనక్కి తగ్గిందని నెటిజన్స్ ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: