ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలలో జరిగిన వింతలు విశేషాలను కేవలం నిమిషాల వ్యవధిలోనే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్లో వెలుగులోకి వచ్చే కొన్ని విషయాలను ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇలాంటి ఘటనలు సినిమాల్లో చూడటం తప్ప నిజజీవితంలో చూడటం ఇదే మొదటిసారి అని కామెంట్లు చేస్తున్న నేటిజన్స్ కూడా ఉన్నారు అని చెప్పాలి.



సాధారణంగా ఏదైనా వాహనం ముందుకు కదలాలి అంటే ఇక తప్పనిసరిగా డ్రైవర్ కావాలి. ఇక ఇటీవలే కాలంలో ఆటోమేటిక్ కార్లు వచ్చాయనుకోండి. ఆ విషయం పక్కన పెడితే. ఇక డ్రైవర్ లేకుండా కారు ముందుకు కదలడం చాలా కష్టం. కానీ ఇటీవల కాలంలో కొన్ని వాహనాలు డ్రైవర్ లేకుండానే రయ్ రయ్ మంటూ దూసుకుపోతూ ఉండడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇటీవలే ఉత్తర ప్రదేశ్ లోని బిజినొర్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 ఏకంగా ఒక ట్రాక్టర్ దానంతట అదే స్టార్ట్ అయ్యి గేర్ వేసుకుని ముందుకు కదిలింది. షో రూమ్ లోకి దూసుకు వెళ్ళింది అని చెప్పాలి. కొత్వాల పోలీస్ స్టేషన్ పరిధిలో సమదాన్ దివాస్ జరిగింది. అయితే ఇందులో పాల్గొనడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకరు కారు తీసుకురాగా.. కిషన్ కుమార్ అనే వ్యక్తి ట్రాక్టర్ తీసుకువచ్చాడు. అయితే ఆ ట్రాక్టర్ ని  పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న షోరూం ముందు పార్క్ చేశాడు. అయితే ఆ తర్వాత గంటసేపటికి ట్రాక్టర్ దానంతట అదే స్టార్ట్ అయింది. అంతేకాదు గేర్ వేసుకొని రేస్ ఇస్తూ ముందుకు కదిలింది. ఇక ఏకంగా షోరూం అద్దాలను కూడా పగలగొట్టేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. ఇక ఒక వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి ట్రాక్టర్ ఆఫ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ వీడియోస్ ట్విటర్లో వైరల్ గా మారిపోయింది. ట్రాక్టర్ కి కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో అని కొంతమంది నేటిజన్స్ ఇది చూసి ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: