మహిళల కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు వంటి వాటిలో కూడా వీరికి అనుకూలంగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను కూడా ప్రకటిస్తూ ఉన్నాయి.ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం తగిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మహిళ ఉద్యోగస్తులకు ప్రత్యేకించి సెలవు దినంగా ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది. ఇక ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న మహిళలకు సైతం స్పెషల్ క్యాజువల్ లీవ్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.


మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలంటు ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.అదేవిధంగా ఈనెల 8వ తేదీన హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు కూడా ప్రభుత్వ సెలవు ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినంగా ప్రకటిస్తూ ఉండేది. ఈ ఏడాది కూడా  సెలవు దినం ప్రకటిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో సామాజికంగా రాజకీయంగా కూడా ఆర్థికంగా ఇలా అన్నిటిలో కూడా ఎదుగుతున్న మహిళలను గుర్తించే రోజుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో కూడా ఉమెన్స్ డే ను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.


ఉమెన్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆ రాష్ట్ర మహిళలకు సెలవుదినంగా ప్రకటించడం జరిగింది. దీంతో మహిళల సైతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు సైతం తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో మహిళలు మరిన్ని వాటిలో రాణిస్తారని.. వారికి అవసరమైన వాటిని సమకూర్చే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: