అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగిన కూడా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే ఎన్నో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చూసి షాక్ అవ్వడం నేటిజన్స్ వంతు అవుతూ ఉంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ట్విటర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. అతివేగం ఎంత దారుణంగా ప్రాణాలు తీస్తుంది అన్నదానికి ఈ వీడియో నిదర్శనంగా మారిపోయింది.
వేగంగా దూసుకు వచ్చిన కారు టోల్ బూత్ ను ఢీకొట్టడంతో కేవలం రెప్పపాటు కాలంలో కారు నుజ్జు నుజ్జుగా మారిపోయింది. ఇక సినిమాల్లో కూడా ఇంత ఘోరమైన యాక్సిడెంట్ జరగదేమో అని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అని చెప్పాలి. చీలి నగరంలోని పురంగ్ లో ఈ ఘటన వెలుగు చూసింది అనేది తెలుస్తుంది. టూల్ బూత్ బారియర్ పైకి అతివేగంగా దూసుకు వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రెప్పపాటు కాలంలో కారు పార్ట్శ్ మొత్తం చెల్లాచెదురుగా మారిపోయి పూర్తిగా ధ్వంసం అయింది. ఇక డ్రైవింగ్ చేస్తున్న 21 ఏళ్ళ కుర్రాడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇదంతా అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.