అయితే నేటి ఇంటర్నెట్ యుగంలో ఎంతో మంది ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కాస్త హుందాగానే ప్రవర్తిస్తూ ఉంటే.. కొంతమంది మాత్రం ఎదుటి వాడిని దెబ్బకొట్టేందుకే పుట్టామేమో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల జపాన్లో ఇలాంటిదే జరుగుతుంది అని చెప్పాలి. సోషల్ మీడియా ట్రెండ్ గురించి జపాన్ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జపాన్ లో ఎక్కువగా సుశి రెస్టారెంట్ లు ఉంటాయి. అంటే ఇక అక్కడ వెయిటర్లు ఉండరు. కస్టమర్ ఆర్డర్ చేసిన ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ సహాయంతోనే అందిస్తూ ఉంటారు.
అయితే ఇలాంటి ఆహార పదార్థాలను ఎంగిలి చేయడం లేదా అశుభ్రపరచడం లాంటి చర్యలతో కొంతమంది రెచ్చిపోతున్నారు. ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుండడంతో అక్కడ జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఇలా వికృతి చేష్టలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. సోయాసాస్ లో ఉమ్మి వేయడం, ఇతర కస్టమర్ల కోసం బెల్టు మీద వెళ్లే ఆహారాన్ని తినడం లేదా ఎంగిలి చేతులతో వాటిని ముట్టుకోవడం ఇక ఇతరుల పాత్రలను వీళ్ళు తీసుకోవడం లాంటి చర్యలకు పాల్పడ్డారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ట్విట్టర్లో వైరల్ గా మారిపోయాయి. అయితే దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇలాంటి పిచ్చి పనులు చేసిన ముగ్గురిని అరెస్టు చేశారు.