ఒక్కరోజు సెలవు అడిగితే ఇవ్వని కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు కనీవినీ ఎరుగను బంపరాఫర్ నే ఇచ్చింది. 'మీరు ఆఫీసుకు రావద్దు..ఇంట్లోనే హాయిగా ప్రశాంతంగా నిద్రపోండి'అంటూ ఆ కంపెనీ బంపరాఫర్ ఇచ్చింది.ఎందుకంటే ఈరోజు అంటే మార్చి 17 వ తేదీన అంతర్జాతీయ నిద్రా దినోత్సవం. నిద్రా దినోత్సవం సందర్బంగా బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే డీ2సీ హోమ్ అండ్ స్లీప్ సొల్యూషన్స్ స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగులకు ఈ సూపర్ ఆఫర్ ని కల్పించింది. దీనికి సంబంధించిన ప్రకటనను కూడా లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.అయితే ఈ కంపెనీ తన ఉద్యోగులకు ఇటువంటి అవకాశాన్ని ఈ సంవత్సరం మాత్రమే కాదు గత ఏడాది కూడా ఇలాగే ఇచ్చింది. ‘రైట్ టు నాప్ పాలసీ’ని ప్రకటించడం జరిగింది. అంటే ఉద్యోగులందరూ కూడా తమ వర్కింగ్ టైమ్ లో కూడా 30 నిమిషాలు నిద్రపోవచ్చు. వర్కింగ్ టైమ్ లో 30నిమిషాలు వేస్టు అయిపోతాయని ఆ కంపెనీ ఆలోచించలేదు. ఆ నిద్రతో ఉద్యోగులు రీఫ్రెష్ అయి ఇంకా మరింత ఉత్సాహంగా పనిచేస్తారని కంపెనీ భావించింది.


కాసేపు నిద్ర పోవడం శరీరాన్ని చాలా ఫ్రెస్ గా ఉంచుతుంది. ఇంకా అంతేగాక ఉత్సాహంగా పనిచేసుకోవటానికి సహకరిస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఆ కంపెనీ తన ఉద్యోగులకు అటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇలా రీఫ్రెష్ అవ్వటం వల్ల ఉత్పాదకత శక్తి కూడా బాగా పెరుగుతుందని ఆ కంపెనీ భావిస్తోంది.ఇంకా అంతేకాదు..తమ లాగానే మరిన్ని కంపెనీలు కూడా తమ తమ ఉద్యోగులకు అటువంటి అవకాశాన్ని కల్పించాలని ఆ కంపెనీ సూచిస్తోంది.అలా ఈ వరల్డ్ స్లీపింగ్ డే సందర్భంగా ఈ వినూత్న ఆఫర్ ఇచ్చిన ఆ కంపెనీ ప్రతినిథి మాట్లాడుతూ.. మా ఉద్యోగులందరికి కూడా ఈ రోజు సెలవు ఇచ్చామని.. మార్చి 17వ తేదీ శుక్రవారం నాడు మా కంపెనీ ఈ అంతర్జాతీయ నిద్ర దినోత్సవాన్ని జరుపుకోనుందని ప్రకటించినందుకు మేము చాలా సంతోషిస్తున్నామని తెలిపారు.మీరు కూడా మీ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్ ని ప్రకటించండి అని ఆ కంపెనీ ఇతర కంపెనీలకి సూచించడం జరిగింది. నిజంగా మంచి ఆలోచన కదూ..

మరింత సమాచారం తెలుసుకోండి: