ఇక ఒకప్పుడు అంటే మన తాత ముత్తాతల కాలంలో తల్లిదండ్రులు సుమారు 10, 12 మంది పిల్లల్ని కనేవారు. ఆ తర్వాత కాలం నుంచి మెల్లగా ఆ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం దేశ జనాభా కూడా విచ్చల విడిగా పెరిగిపోవడంతో ఇప్పుడు ఒక్కరు, ఇద్దరు లేదా ముగ్గరు పిల్లల్ని కనమని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అందువల్ల ఇండియాలో ఎక్కవ మంది తల్లిదండ్రులు అలానే పిల్లల్ని కంటున్నారు.కాని అగ్ర రాజ్యం అమెరికాలోని ఓ మహిళ ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే అప్పటికే ఆమెకు 28 ఏళ్ల వయసు మాత్రమే ఉండటం. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెవెడా రాష్ట్రానికి చెందిన 39 ఏళ్ల కోరా డ్యూక్ 2001 వ సంవత్సరంలో తొలిసారిగా గర్భం దాల్చింది. అప్పుడు ఆమెకు కేవలం పదిహేడేళ్లు మాత్రమే. ఆ తర్వాత ఒకరి తర్వాత మరొకరికి ఆమె జన్మనిచ్చింది. 2012 వ సంవత్సరంలో ఆమె చివరిసారిగా బిడ్డకు జన్మనిచ్చింది.


ప్రస్తుతం కోరా డ్యూక్ తన భర్త ఆండ్రే డ్యూక్ తో పాటు మొత్తం 8 మంది సంతానంతో కలిసి జీవిస్తోంది. అయితే వీరికి పుట్టిన మూడో బిడ్డ మాత్రం పాపం ఏడు రోజులకే చనిపోయింది. ఇటీవల తన సంతానంతో కలిసి కోరా చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పిల్లలను వయసుల వారీగా నిల్చోబెట్టి వారందరిని పరిచయం చేస్తూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసింది. ఈ వీడియో నెటీడన్లను ఎంతగానో ఆకర్షించింది. అయితే తాను కావాలని ఇంత మంది పిల్లలను కనలేదని కోరా చెబుతోంది. సంప్రదాయ కుటుంబ నియంత్రణ పద్ధతులు విఫలం కావడం వల్లే ఇన్ని సార్లు గర్భం ధరించినట్లు ఆమె పేర్కొంది. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నట్లు ఆమె వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: