అసెంబ్లీ సమావేశాల్లోనే పోర్న్ వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు ఓ ఎమ్మెల్యే. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే శాసనసభ సమావేశాల్లో పోర్న్ వీడియోలు చూశారు.ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ త్రిపురలో విజయం సాధించి.. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.గురువారం నాడు బడ్డెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. బగ్‌బాసా అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే అయిన జాదబ్ లాల్ నాథ్ తన ఫోన్‌లో వీడియోలు చూస్తూ కనిపించాడు. తన కెమెరాను జూమ్ చేయగా.. అవి ఏకంగా పోర్న్ వీడియోలుగా తేలింది. స్పీకర్, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు ఇలా ఈ బుద్ధిలేని ఎమ్మెల్యే వీడియోలు చూడగా..ఇక వెనుక నుంచి వీడియో తీశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్‌గా మారింది.ఇక ఈ చెత్త ఘటనపై బీజేపీ కూడా స్పందించింది. ఆ ఎమ్మెల్యేను ఇందుకు వివరణ కోరుతూ.. అతనికి నోటిసులు పంపించింది. అయితే ఈ వీడియోపై ఎమ్మెల్యే ఇంకా స్పందించలేదు.


ఇక సభ ముగిసిన వెంటనే ఆయన అసెంబ్లీ ప్రాంగణం నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఇక సీపీఎంకు కంచుకోటగా పేరొందిన బగ్‌బాసా అసెంబ్లీ నియోజకవర్గంలో జాదబ్ లాల్ నాథ్ బీజేపీ విజయపతాకాన్ని ఎగురవేశారు. 2018 వ సంవత్సరం ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి బిజితా నాథ్ బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్ నాథ్‌పై ఏకంగా 270 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2023 వ సంవత్సరం ఎన్నికల్లో జాదబ్ లాల్ నాథ్‌  ఏకంగా 1400 ఓట్ల తేడాతో గెలుపొందారు.అయితే ఇలా బహిరంగ ప్రదేశంలో పోర్న్ చూస్తూ ఓ బీజేపీ నేత పట్టుబడడం ఇదే తొలిసారి కాదు. 2012 వ సంవత్సరంలో కర్ణాటకలోని అప్పటి బీజేపీ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులు రాష్ట్ర అసెంబ్లీలో తమ ఫోన్‌లలో పోర్న్ క్లిప్‌లు చూస్తూ  అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరు కూడా అప్పుడు రాజీనామా చేశారు. అయితే మంత్రులు లక్ష్మణ్ సవాది ఇంకా సీసీ పాటిల్ ఏ తప్పు చేయలేదని విచారణలో తేలడంతో పార్టీ వారిని తిరిగి చేర్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: