ఇప్పటికే ఒకవైపు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంటే కొంతమంది యువకులు మాత్రం ఇక బైక్ నడపడంలో తాము తోపు అని అందరికీ నిరూపించుకోవాలని తెగ ఆశపడుతున్నారు. దీంతో ఏకంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ బైక్ పైనే విన్యాసాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారూ అని చెప్పాలి. వెరసి కొన్ని కొన్ని సార్లు అంత బెడిసి కొట్టి ఇక చివరికి బైక్ అదుపు తప్పి కింద పడిపోయి గాయాల పాలవుతున్నారు. ఇక్కడ ముగ్గురు యువకులు కూడా ఇలాగే చేయాలని ప్రయత్నించి.. చివరికి కర్మ ఫలితాన్ని అనుభవించారు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.
ఈ వీడియోలో చూసుకుంటే ఒక బైక్ పై ముగ్గురు యువకులు ఉన్నారు. ముగ్గురు యువకులు ఎక్కడం అంటేనే అది రూల్స్ కి విరుద్ధం. ఇక ఆ ముగ్గురు సరిగ్గా బైక్ నడపకుండా అటు ఇటు బైక్ తిప్పుతూ విన్యాసాలు చేసేందుకు ప్రయత్నించారు. కాసేపు బాగానే బైక్ నడిపారు. కానీ ఆ తర్వాత ఒకసారిగా బైక్ స్కిడ్ అయింది. దీంతో ఒక్కసారిగా డివైడర్ పై పడిపోయారు ముగ్గురు యువకులు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి అన్నది మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇక ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో అతి చేస్తే కర్మ ఫలితం ఇలాగే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్..