సాధారణంగా రహదారిపై ఎక్కడైనా ఇసుక ఉన్న లేదంటే నీళ్లు పడినా కూడా ఇక అలాంటి ప్రాంతంలో వాహనం నడపడానికి ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అయితే ఎక్కడ బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదం జరుగుతుందో అని ఎంతో నెమ్మదిగా బండిని పోనిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటిది ఏకంగా నేరుగా నీళ్లల్లో వాహనం నడపడం సాధ్యమవుతుందా అంటే ద్విచక్ర వాహనదారులను ఎవరిని అడిగిన అలాంటిది అసాధ్యమని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు అని చెప్పాలి.



 అతను నిజంగా అది ఎలా చేస్తాడో ఇప్పటికీ అర్థం కాకా నేటిజన్స్ అందరూ కూడా తల పీక్కుంటున్నారు. సాధారణంగా నీళ్లలో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా పడవ అవసరం. లేదంటే చిన్న తెడ్డు అయినా ఉండాల్సిందే. ఇవేవీ లేకుండా నీటిలో ప్రయాణం చేయాలి అంటే చివరికి నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఏకంగా పల్సర్ బైక్ తో నదిని దాటేయడానికి ప్రయత్నించాడు. పల్సర్ బైక్ తో నదిని దాటేయడం ఏంటి... అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. అతనికి ఏమైనా పిచ్చా అంటారా.



 అతనికి పిచ్చో మరేంటో తెలియదు కానీ అతడు చేసిన సాహసం మాత్రం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని అవ్వక్కయ్యలా చేస్తుంది. అసలు నీళ్లపై బైక్ ఎలా నడపగలిగాడు అన్న విషయం తెలియక ప్రతి ఒకరు కూడా ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. నదిలో రెండు అడుగుల కంటే ఎక్కువ నీరు లేకపోవడంతో అతను ఎంతో చాకచక్యంగా బైక్ పైన నదికి ఈ వైపు నుంచి అవతలి వైపుకు వెళ్ళిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. కాగా ఇప్పుడు వరకు ఈ వీడియోని ఐదు లక్షల మందికి పైగానే వీక్షించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: